Monday 25 January 2016

gjkgchk

స్వార్ధాల మత్తులో, సాగేటి ఆటలో,
ఆవేశాలు... ఋణపాశాలు... తెంచే వేళలో,
సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం
గుండెలే.. బండగా.. మారిపోయేటి స్వార్ధం
తల్లినీ.. తాళినీ.. డబ్బుతో తూచు బేరం
రక్తమే.. నీరుగా.. తెల్లబోయేటి పంతం
కంటికీ.. మంటికీ.. ఏకధారైన శోకం
తలపై విధి గీత, ఇల పైనే వెలసిందా?
రాజులే బంటుగా మారు ఈ క్రీడలో,
జీవులే పావులైపోవు ఈ కేళిలో!!
ధనమే తల్లి.. ధనమే తండ్రి.. ధనమే దైవమా..!!??
సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో, సాగేటి ఆటలో,
ఆవేశాలు... ఋణపాశాలు... తెంచే వేళలో,
సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం
కాలిలో.. ముల్లుకీ.. కంట నీరిచ్చు కన్ను,
కంటిలో.. నలుసునీ.. కంట కనిపెట్టు చెల్లీ!
రేఖలు.. గీతలు.. చూడదీ రక్తబంధం,
ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం!!
గదిలో ఇమిడేనా మది లోపల మమకారం??
పుణ్యమే.. పాపమై.. సాగు ఈ పోరులో,
పాపకే పాలు కరువైన పట్టింపులో,
ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని??
సంసారం ఒక చదరంగం... అనుబంధం ఒక రణరంగం

0 comments:

Post a Comment